- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే చివరికల్లా వాట్సాప్ పే
దిశ, వెబ్ డెస్క్ :
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇకపై పేమెంట్స్ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్న వాట్సాప్ సంస్థ మే చివరి కల్లా మార్కట్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో వాట్సాప్ పే ఫీచర్ దేశంలోని వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. కాగా వాట్సాప్ పే సేవలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా వినియోగదారుల డేటాను భారత్‌లోని సర్వర్లలోనే స్టోర్ చేయాలన్న కేంద్రం నిబంధనల మేరకు వాట్సాప్‌కు నిర్ణయం తీసుకునేందుకు కొంత ఆలస్యమైంది. ఇదే కాకుండా పలు కారణాల వల్ల వాట్సాప్ పే ఈ సదుపాయం అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ పే బీటా టెస్ట్ కూడా అయిపోయినట్లు సమాచారం. ఇక ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వాట్సాప్ పే దేశంలోనే అతి పెద్ద డిజిటల్ చెల్లింపు సంస్థగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ కు భారత్ లో 400 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. వాట్సాప్ పే అందుబాటులోకి వస్తే.. యూజర్లకు చాలా సౌకర్యంగా ఉంటుంది. పేమెంట్స్ కోసం మరో యాప్ వాడాల్సిన అవసరం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల సాయంతో దీనిని అందుబాటులోకి తీసుకు రానున్నారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే ఇప్పటికే ఈ విభాగంలో ముందంజలో ఉన్నాయి. వాట్సాప్ కూడా పేమెంట్స్ విభాగంలో అడుగుపెడితే.. వాటికి గట్టి పోటీ ఎదురవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వాట్సాప్ సంస్థ .. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫిబ్రవరి 2018న ‘వాట్సాప్ పే ’సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Tags: whatsapp, facebook, whatsapp pay, digital payments