- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థిని ఆదుకున్న వాట్సాప్ గ్రూప్..
దిశ, మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కొత్త బస్‌స్టాండ్ వద్ద నివాసం ఉండే వయ్య ఏసు గత కొంతకాలంగా స్థానిక పాత ఇనుప సామాన్ దుకాణంలో దినసరి కూలీగా పనిచేసేవాడు. ఇటీవల ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. ఏసు, భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. తన పెద్ద కూతురు ప్రవలికను ఉన్నత చదువులు చదివించాలని నల్గొండలో ఓ నర్సింగ్ కళాశాలలో చేర్పించాడు. తండ్రి హఠాన్మరణంతో తన కళాశాల ఫీజులకు ఇబ్బందులు పడుతుండగా మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్ దాతలు సహృదయంతో స్పందించి రూ.15,000 ఆ విద్యార్థినికి సహాయం చేశారు.
విశ్రాంత ఉపాధ్యాయులు, ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య చేతుల మీదుగా అందించారు. మున్ముందు ప్రవలికకు చదువులకు తమ వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ సామాజిక సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు, గంధం శ్రీనివాస్ రావ్, కారుపోతుల వెంకన్న, పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.