వాట్సాప్లో ‘టుగెదర్ ఎట్ హోమ్’ స్టిక్కర్లు

by vinod kumar |
వాట్సాప్లో ‘టుగెదర్ ఎట్ హోమ్’ స్టిక్కర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా వ్యక్తిగత బాధ్యతగా ఇంట్లోనే ఉండటం ఎంతో ఆవశ్యకం. కరోనాను నియంత్రించాలంటే ఏకైక ఆయుధం .. లాక్‌డౌన్. ఎవరికి వారు.. స్వీయ నియంత్రణ చేసుకోవాలి. దీనికి మద్దతుగా వాట్సాప్ నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఫీలింగ్స్, ఎమోషన్స్‌ను తెలియజేసే విధంగా ప్రపంచ ఆరోగ్యసంస్థతో కలిసి వాట్సాప్ కొత్తగా ‘టుగెదర్ ఎట్ హోమ్’ అనే స్టిక్కర్లును తీసుకు వచ్చింది.

మనదేశంలో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లలో దాదాపు నూటికి ఎనభై శాతం మంది వాట్సాప్ వాడుతున్నారు. అందులో చాలామంది చాట్ చేసేటప్పుడు స్టిక్కర్లను వినియోగించడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. మనం చెప్పాలనుకున్న మ్యాటర్ ఒక్క స్టిక్కర్‌తో చెప్పేయచ్చు. అందుకే వాట్సాప్, డబ్య్లూహెచ్‌వో‌లు కూడా ప్రజల్లో కరోనా‌పై అవగాహన కల్పించడానికి, ఇంట్లో ఉండటం వల్ల కలిగే లాభాలాపై స్టిక్కర్ల విడుదల చేశాయి. ఈ స్టిక్కర్లలో ‘వి విల్ డూ దిస్ టుగెదర్’, ‘గాల్లోనే హై ఫైవ్ ఇచ్చుకోవడం’(ఎయిర్ హై ఫైవ్), వర్క ఫ్రమ్ హోమ్, ‘గ్రూప్ వీడియో కాలింగ్’, ‘బెడ్ పై పడుకొని టీవీ చూడటం’, ‘యోగా చేయడం’, ‘చేతులు కడుక్కోవడం’, ‘బైనాక్యులర్స్ తో చూడటం’, ‘ఆర్ యూ ఓకే’ ‘యూ ఆర్ మై హీరో ’ వంటివి నెటిజన్లను, వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేషియన్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, ఇంగ్లిష్, హిందీ భాషలతో కలిపి మొత్తం 10 భాషల్లో విడుదల చేశారు. ప్రస్తుత కాలంలో అధికశాతం ప్రజలు వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ అని, అందుకే దీని ద్వారానే వారికి కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

tags :coronavirus, lockdown, work from home, whatsapp, who, stickers

Advertisement

Next Story