- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
by Sridhar Babu |
X
దిశ,వీణవంక : ఆటోను టాటా ఏస్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడగా మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన బొంతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుai తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గసికంటి స్వరూప, పుల్లూరి కిరణ్, పుల్లూరి వీరమ్మ, అన్నారంనకు చెందిన రామగిరి రవి, కరీంనగర్‌కు చెందిన రేణుకుంట అన్నపూర్ణ బుధవారం సమీప బంధువుల శుభకార్యానికి ఆటోలో మల్లన్నపల్లికి వెళ్లారు.
తిరిగి వారి స్వగ్రామానికి వెళ్తుండగా బొంతుపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న టాటా ఎస్ ఢీకొనడంతో గసికంటి స్వరూపకు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన స్వరూపను కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నట్లు సమాచారం.
Advertisement
Next Story