భర్త పై భార్య, బామ్మర్ధుల దాడి

by Sridhar Babu |
భర్త పై భార్య, బామ్మర్ధుల దాడి
X

దిశ, వెల్గటూర్ : ధర్మపురి పట్టణానికి చెందిన ఖాజా ముషిక్ అనే వ్యక్తి పై అతని భార్య కాజా ఆసియా, బామ్మర్దులు అంజుత్, అలీ దాడి చేశారు. బాధితుడు మూషిక్ ఫిర్యాదు మేరకు నిందితుల పై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ గా పనిచేసే మూషిక్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు.

మద్యం తాగడం వల్ల తరచుగా ఇంట్లో తన భార్యతో గొడవలు పెట్టుకునే వాడు. ఈనెల 16న మూషిక్ కమలాపూర్ చౌరస్తా వద్ద ఉండగా తన బామ్మర్దులు అలీ, అంజుత్ ఆయన వద్దకు వచ్చి వారి ఇంటికి తీసుకువెళ్లారు. పని చేయకుండా తాగుతూ పరువు తీస్తున్నావు అంటూ ఆయన భార్య ఖాజా ఆసియా, బామ్మర్డులు కలిసి ముషీక్ ముఖం మీద శరీరంపై జీడిగింజలు దంచి తయారు చేసిన రసాన్ని పోశారు. ఖాజా ముషిక్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed