- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికసిత్ భారత్ అనేది కల కాదు.. ఒక లక్ష్యం: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్
దిశ, తెలంగాణ బ్యూరో: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలంగాణ పర్యటనలో భాగంగా.. తన సతీమణితో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉప రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున మంత్రి జూపల్లి కృష్ణారావు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మెదక్ వెళ్లారు. అక్కడ తునికిలో ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ అనేది కల కాదు.. ఒక లక్ష్యం అన్నారు. రాబోయే రెండేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో శక్తిగా మారబోతుందని తెలిపారు. భారత్ రోజురోజుకు ఆర్థికంగా ఎదుగుతోందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ రాకకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ముందస్తుగానే సమాచారం ఉండటంతో రెండు రోజుల పాటు బ్లూ బుక్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి గతంలోనే ఆదేశాలను జారీ చేశారు. సీఎస్ ఆదేశాలతో రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లు, ఉప రాష్ట్రపతి కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.