- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్‌లో భారతీయుల పరిస్థితి..?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటికే 811 మందికి పైగా చనిపోగా, 40 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కొద్దిరోజులుగా యొకొహామ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయిన ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే జపాన్‌కు చెందిన విహార నౌకలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం కూడా మరో ముగ్గురికి ఈ వైరస్ సోకడంతో వీరి సంఖ్య 64కు చేరింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఈ నౌకలోనే ఉన్న 138 మంది భారతీయుల్లో ఎవరికీ ఈ వైరస్ సోకలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం స్పష్టం చేశారు. నౌకలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు జపాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ నౌకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు భారతీయులు తమను ఎలాగైనా రక్షించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోల ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరంతా ముంబయి, గోవా, కేరళకు చెందినవారు కాగా.. భారత్‌లో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెలువడుతున్నాయి. పైగా చైనాలో చిక్కుకున్న పాకిస్థాన్ విద్యార్థులకు సహాయం చేస్తామని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి ప్రకటించడం బాగానే ఉన్నా.. మరి భారతీయుల పరిస్థితేంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకే ప్రమాదమున్న 20 దేశాల్లో భారత్ కూడా ఉందని జర్మనీకి చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే ముగ్గురు కేరళీయులకు ఈ వైరస్ సోకగా.. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.