- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ ఏంటి?.. మూడు జిల్లాల్లో పరిస్థితి ఏంటి?
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు జిల్లాలు ఉన్నాయి. ఏపీ ప్రధాన పట్టణాలైన విశాఖపట్టణం, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకూడా లాక్ డౌన్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఇంతకీ లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏం జరుగనుంది?
లాక్ డౌన్ అంటే మూతపడడమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూడు జిల్లాల్లో అన్ని సేవలు మూతపడనున్నాయి. ఈ మూడు జిల్లాలతో బాహ్య ప్రపంచానికి నిర్ణీత కాల వ్యవధి వరకు పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు రవాణా సంబంధాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ జిల్లాల్లో నిర్ణీత నిబంధనలు అమలు కానున్నాయి. ప్రజలు అకారణంగా రోడ్లపైకి వచ్చే అవకాశం లేదు. నెలాఖరు వరకు అంటే 31 వరకు ఈ జిల్లాల వాసులంతా ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది.
ఈ మూడు జిల్లాల్లోనే లాక్ డౌన్ ఎందుకంటే.. ఈ మూడు జిల్లాల్లోనే కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనా బాధితులు ప్రధానంగా ఈ జిల్లాల వాసులతోనే సంబంధ బాంధవ్యాలు నెరపారు. దీంతో వారు కరోనా వాహకాలుగా మారారు. దీంతో వారిలో కరోనా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు కరోనా సోకకుండా నివారించాలంటే ప్రభుత్వం ముందున్న తక్షణ ఉపాయం లాక్‌డౌన్.
నిత్యావసర సౌకర్యాలు సరఫరా చేస్తూ ప్రతి ఒక్కరినీ నిర్ధేశిత ప్రాంతంలో ఉంచడమే లాక్‌డౌన్ లక్ష్యం. ఇలా చేయడం ద్వారా పరిమిత సంఖ్యలో కరోనా బాధితులను గుర్తించడం సులభంగా మారుతుంది. తద్వారా వారికి వైద్యమందించడం కూడా సులభమే. అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉదయిస్తోంది.
భారత దేశంలో పెంపుడు జంతువులు మాత్రమే కాకుండా రోడ్లపై కుక్కలు, ఆవులు, ఎద్దులు వంటి జంతువులు స్వేచ్ఛగా విహరిస్తాయి. లాక్‌డౌన్ సమయంలో ఆహారం కోసం ఇవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంచరిస్తాయి. దీంతో ఇవి కరోనా వాహకాలుగా పనిచేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.
Tags: lock down, 75 districts, 3 districts, corona virus, covid-19