భారత్‌లో భారీగా పెరిగిన బంగారం గిరాకీ!

by Harish |   ( Updated:2021-04-29 06:07:07.0  )
భారత్‌లో భారీగా పెరిగిన బంగారం గిరాకీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారానికి గిరాకీ భారీగా పెరిగింది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య బంగారం డిమాండ్ 140 టన్నులకు పెరిగినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం పెరిగిందని పేర్కొంది. కొవిడ్ ఆంక్షల సడలింపు, ధరలు తగ్గడం వంటి పరిణామాలు డిమాండ్ పెరగడానికి కారణమని డబ్ల్యూజీసీ వివరించింది. జనవరి-మార్చి మధ్య విలువ పరంగా 57 శాతం పెరిగి రూ. 58,800 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ. 37,580 కోట్లుగా నమోదైంది. ఇక, పసిడి ఆభరణాల గిరాకీ సమీక్షించిన కాలంలో 7 శాతం పెరిగి 102.5 టన్నులకు పెరిగింది. విలువ పరంగా రూ. 43,100 కోట్లు. గతేడాది 93.9 టన్నులు. విలువ పరంగా ఇది రూ. 27,230 కోట్లు. అంతేకాకుండా బంగారంపై పెట్టుబడులు సైతం 34 శాతం పెరిగి 37.5 టన్నులకు పెరిగాయని డబ్ల్యూజీసీ వెల్లడించింది. విలువ పరంగా 73.9 శాతం పెరిగి రూ. 15,780 కోట్ల పెట్టుబడులు పెట్టారని డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే, బంగారం రీసైకిల్ 20 శాతం తగ్గిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed