- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా : మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే నందిగ్రామ్ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు సీఎం బెనర్జీ ప్రకటించారు. ‘నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని టీఎంసీ జనరల్ సెక్రెటరీ సుబ్రతా బక్షికి అభ్యర్థిస్తాను. భవానిపూర్ స్థానం నుంచి పోటీకి మరో మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తాను. భవానిపూర్ సంక్షేమాన్ని విస్మరించను. కానీ, నందిగ్రామ్ ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను’ అని నందిగ్రామ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆమె ప్రకటించారు. అనంతరం బీజేపీపై విమర్శలు చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, తాము రైతుల పక్షాన చివరి వరకూ నిలుస్తామని అన్నారు. పోరాటాలకు నందిగ్రామ్ దారి చూపిందని, నేడు పంజాబ్ రైతులు అదే దారిలో ముందుకెళ్లి నూతన సాగు చట్టాలపై ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను లూఠీ చేయాలనుకుంటోందని ఆరోపించారు.