‘కరోనా హరేగా’.. డోనర్స్‌ను వెతకడంలో యూజ్‌‌ఫుల్ సర్వీస్

by Anukaran |   ( Updated:2021-05-12 11:19:36.0  )
‘కరోనా హరేగా’.. డోనర్స్‌ను వెతకడంలో యూజ్‌‌ఫుల్ సర్వీస్
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ ఆపత్కాలంలో టెక్నాలజీ కీ రోల్‌గా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రజల నాడీని చెప్పడమే కాకుండా వారి అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే సమాచార మార్పిడి జరుగుతోంది. ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఇంజెక్షన్లు, ఐసియు హాస్పిటల్ బెడ్స్, ప్లాస్మా డోనర్స్ నుంచి విరాళాలు, విన్నపాల వరకు ప్రభుత్వాన్ని మించిన పాత్రను ఆన్‌లైన్ పోషిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోని కొంతమంది టెక్ సావీలు సోషల్ మీడియా శోధనలను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడటానికి ముందుకు వచ్చారు. ముఖ్యమైన సెర్చ్ ప్లాట్‌ఫామ్స్‌, ఫీచర్స్‌ను ప్రారంభించి వాటి ద్వారా ఏ ప్రాంతంలో ఏం కావాలి? పేషెంట్‌కు ఏం అవసరం ఉంది? ఎప్పుడు కావాలి? వంటి అంశాల ఆధారంగా ఫిల్టర్ చేసే కొన్ని వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆ వివరాలు..

కరోనా హరేగా (Corona Harega)

ఇటీవలే ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఇదో క్రౌడ్ సోర్స్ వెబ్‌సైట్. COVID-19 ఎసెన్షియల్స్ అయిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆహారం, మందులు మొదలైనవి కావాలనుకుంటే ఇందులో సంప్రదించవచ్చు. ఇందులో అవి అందించే వ్యాపారుల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కొవిడ్ ఎసెన్షియల్స్ అందుబాటులో ఉంటే ఆ వివరాలు వెంటనే ఇందులో పోస్ట్ చేయొచ్చు. మొదట వ్యక్తిగతంగా ధృవీకరించిన తర్వాత వెబ్ నిర్వాహకులు ఇందులో వివరాలను పోస్ట్ చేస్తారు. అయితే కరోనా హరేగా అనేది నాన్ ప్రాఫిట్ ఇన్షియేటివ్. వారు ఎటువంటి విరాళం లేదా డబ్బు సహాయం అడగరు. అది వాటిని అందించే డీలర్ల మీద ఆధారపడి ఉంటుందని వెబ్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

Link: https://coronaharega.co.in/search-covid-resources

కొవిడ్ సిటిజన్స్.ఆర్గ్ (Covidcitizens.org)

కొవిడ్ సిటిజెన్స్ అనేది సిటిజన్ డ్రైవెనె -కమ్యూనిటీ. ఇది ఇన్షియేటివ్ కొవిడ్ ఎసెన్షియెల్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడానికి ఏర్పాటు చేశారు. మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, రక్త పరీక్షలు, భోజన సేవలు, ప్లాస్మా, అంబులెన్సులు, ఇతర క్లిష్టమైన కొవిడ్ వనరులపై 300+ వాలంటీర్లు సేకరించిన సమాచారం ఇందులో ఉంటుంది.

యూజర్లు వెబ్‌సైట్‌లో నేరుగా తమ ప్రాంతాన్ని బట్టి తమకు అవసరమైన రీసోర్సెస్ సెర్చ్ చేయొచ్చు. లేదా దాని వాట్సాప్ బోట్ ద్వారా సమాచారాన్ని కనుగొనవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవడానికి + 1-234-517-8991( ఇది వాట్సాప్ బోట్ సంఖ్య)కు “COVID” అని సందేశం పంపాలి. ఈ వేదిక 3.5 లక్షలకు పైగా కొవిడ్-సంబంధిత వైద్య అభ్యర్థనలకు ప్రతిస్పందించినట్లు పేర్కొంది. అంతేకాదు 18,000 మంది వైద్య సరఫరాదారుల రియల్ టైమ్, ట్రస్టెడ్ డేటాబేస్ ద్వారా 20,000 మందికి పైగా ప్రాణాలను రక్షించడంలో సహాయపడినట్లు తెలిపింది.

కొవిడ్ ఫ్యాక్ట్స్.ఇన్ (Covidfacts.in)

ఢిల్లీకి చెందిన నలుగురు యువకులు అభివృద్ధి చేసిన ఈ క్రౌడ్ సోర్స్ వెబ్‌సైట్ వినియోగదారులకు దేశంలో ఎక్కడైనా వనరులను కనుగొనడంలో సహాయపడుతుంది. ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటికప్పుడు కొవిడ్ బాధితులకు అవసరమైన ఎసెన్షియల్ వివరాలు అప్‌డేట్ అవుతుంటాయి. అంతేకాదు తప్పుడు సమాచారం, తప్పు ఎంట్రీలు నమోదు కాకుండా ఉండేందుకు ఐఐటి-కాన్పూర్ గ్రాడ్యుయేట్ మాజీ ఐఎఎస్ అధికారి సంజీవ్ గుప్తా నేతృత్వంలోని వెబ్‌సైట్ క్రియేటర్స్ ఓటీపీ ధృవీకరణ వ్యవస్థను సృష్టించి, ఇంటర్‌ఫేస్‌ను పునరుద్ధరించారు.

Link: https://covidfacts.in/

మిషన్ మిలియన్ ఎయిర్ (Mission MillionAir)

ఇదో వాట్సాప్ బోట్. ఏఐ స్టార్టప్ ‘వెర్లూప్ ఐవో’ దీన్ని ప్రారంభించింది. కొవిడ్ బాధితులను ఆక్సిజన్ సరఫరాదారులతో కనెక్ట్ చేయడంలో ఇది ప్రజలకు సహాయపడుతుంది. వీరు అందించే సేవను ఉపయోగించాలనుకునే వ్యక్తులు + 91-8047-10-7750 వాట్సాప్ నంబర్‌కు “హలో”(hello) అని పంపాలి. మందులతో పాటు, ప్లాస్మా డోనర్స్ అవసరమున్న వారికి ఆయా డోనర్స్‌ను వెతకడంలోనూ ఈ సర్వీస్ యూజ్ అవుతుంది.

ఇవే కాకుండా ట్విట్టర్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా కొవిడ్ ఎసెన్సియల్స్ సమాచారాన్ని అందించడంలో సాయపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed