ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ నెల 23న మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-20 08:25:52.0  )
ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ నెల 23న మరో అల్పపీడనం..  ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలను వరదలు(Floods) ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల వల్ల కొంత మంది తమ ఇళ్లను కూడా కోల్పోవడం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఏపీలో ఇప్పటికీ వరద బాధితులను(Flood Victims) ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ను(Andhra Pradesh) వణికించిన వరణుడు మరోసారి భారీ వర్షాలు(Heavy Rains) కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం(low pressure) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం(weather station) వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయి. దీని ప్రభావంతో నేడు(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దీంతో ఈ నెల 23, 24వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. అనకాపల్లి, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed