భారత్‌లో మూడో దశ వ్యాప్తి లేదు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

by  |

న్యూఢిల్లీ : ఇండియాలో కరోనా వైరస్ ఇంకా మూడో దశకు చేరుకోలేదని, ఇక్కడ సామూహిక వ్యాప్తి జరగడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గురువారం విడుదల చేసిన నివేదికలో పొరపాటుగా ఇండియాలో కరోనావైరస్ సామూహిక వ్యాప్తి దశకు వచ్చినట్లు పేర్కొన్నామని సంస్థ తప్పు సరిచేసుకున్నది. కేవలం కొన్ని ప్రాంతాల్లో అది కూడా చాలా తక్కువ కేసులు మాత్రమే ఉన్నట్లు సవరించిన నివేదికలో పేర్కొన్నది.

మూడోదశ లేదు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

దేశంలో కమ్యూనిటీ కాంటాక్ట్ దశ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం మీడియాకు స్పష్టం చేశారు. ఎవరి నుంచి వైరస్ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే కమ్యూనిటీ కాంటాక్ట్‌ దశగా పేర్కొంటారు. కాని ఇండియా ఇంకా ఆ దశకు చేరుకోలేదని.. లాక్‌డౌన్ నిబంధనల వల్లే ఇంకా రెండో దశకే కరోనావ్యాప్తి పరిమితమైనట్లు మంత్రి వెల్లడించారు. దేశంలోని 600 జిల్లాలకు గాను 400 జిల్లాల్లో అసలు వైరస్ ఉనికే లేదని కేవలం 133 జిల్లాల్లోనే కరోనా హాట్‌స్పాట్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు.

Tags: coronavirus, transmission stage, third stage, WHO, second stage, error, report

Advertisement

Next Story

Most Viewed