- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : కలెక్టర్
దిశ, కొత్తగూడ : ఏజెన్సీ మండలమైన గంగారంలోని పలు ప్రభుత్వ శాఖలలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మొదటగా తిర్మలగండిలోని ప్రాథమిక పాఠశాలకి వెళ్లారు. అక్కడి ఉపాధ్యాయుల పని తీరుపై ఆరా తీశారు. ముగ్గురు ఉపాధ్యాయులలో ఇద్దరే ఉన్నట్లు గుర్తించారు. ప్రధానోపాధ్యాయులు గత మూడు రోజులుగా హాజరు కావడం లేదని తెలపడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు చేపట్టాలని జిల్లా విద్యశాఖాధికారిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. గంగారం సబ్ సెంటర్ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు.
ఉమ్మడి మండలంలో మొట్ట మొదటిగా పూర్తి చేసినందుకు ఏఎన్ఎం నాగలక్ష్మి, గంగారం మండల ఎంపీపీ సువర్ణపాక సరోజనను అభినందించి శాలువాతో సన్మానించారు. అనంతరం కోమట్లగూడలోని పీహెచ్‌సీ, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్‌వాడీ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ హరీష్ రాజు, గంగారం వైద్య అధికారి ముక్రమ్, తహసీల్దార్ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్యామ్ సుందర్, ఎస్సై సురేష్, ఎంపీవో సత్యనారాయణ, ఎంఈవో శ్రీదేవి, జడ్పీటీసీ ఈసం రమ సురేష్, వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర పోత్తయ్య తదితరులు పాల్గొన్నారు.