ఒక్క ఆంధ్ర ఉద్యోగిని రానివ్వం : శివాజీ, అంజయ్య

by Shyam |
ఒక్క ఆంధ్ర ఉద్యోగిని రానివ్వం : శివాజీ, అంజయ్య
X

దిశ, న్యూస్ బ్యూరో: ధర్మాధికారి కమిటీ సిఫారసులను పక్కన పెట్టి ఏపీ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణకు పంపించడంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పోరాటం మంగళవారం కొనసాగింది. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో మంగళవారం నుంచి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు శివాజీ, అంజయ్య మాట్లాడుతూ ధర్మాధికారి తన రిపోర్ట్‌లో తెలంగాణ హోం డిస్ట్రిక్ట్ నేటివ్ ఉన్నవాళ్లను రిలీవ్ చేయాలని ఆదేశించగా అసలు ఈ విభజనకు సంబంధం లేని 584 మంది ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏ ఒక్క ఆంధ్ర ఉద్యోగి తెలంగాణకు వస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ఆంధ్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివాజీ, అంజయ్య హెచ్చరించారు. ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులు వెళ్లిపోయేదాకా తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

Tags : ts vidyuth jac, dharmadhikari, andhra vidyuth employees, protest

Advertisement

Next Story

Most Viewed