వారికి ఎల్లప్పుడు అండగా ఉంటాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by Shyam |   ( Updated:2021-12-14 08:30:04.0  )
వారికి ఎల్లప్పుడు అండగా ఉంటాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
X

దిశ, పాలమూరు: తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని అశోక్ థియేటర్ చౌరస్తా ప్రధాన మురికి కాలువలో 10 లక్షల 30 వేల రూపాయలతో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వేరు చేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్‌లు వార్డులలో తిరగలేని పరిస్థితి ఉండేదని తాగునీటికి, విద్యుత్ తో పాటు, అనేక సమస్యలు ఉండేవన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణం చాలా బాగా అభివృద్ధి చెందిందన్నారు.

ముఖ్యంగా ప్రధాన మురికి కాలువల్లో చెత్తా చెదారం నిండిపోకుండా కాలువలో వచ్చే ప్లాస్టిక్ ను తక్షణమే వేరు చేసే విధంగా నూతన టెక్నాలజీ తో ఒక యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాలన్నారు. వేపురుగెరి కమ్యూనిటీ హాల్ కు ఇదివరకే 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చామని, ఇప్పుడు మరో 15 లక్షలు కావాలని కోరారని వాటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే మున్సిపాలిటీలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని, తాము పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed