కాపులను చిన్నచూపు చూడొద్దు..సీఎం జగన్‌కు మాజీమంత్రి లేఖ

by srinivas |   ( Updated:2021-11-05 08:13:40.0  )
కాపులను చిన్నచూపు చూడొద్దు..సీఎం జగన్‌కు మాజీమంత్రి లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారు. టీడీపీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపు కులాలకు కేటాయించారని..అయితే దీన్ని పక్కనపెట్టేలా మరో జీవోను వైసీపీ సర్కార్ ఇవ్వడం సరికాదన్నారు. కాపులను చిన్నచూపు చూడడం సరికాదని లేఖలో సూచించారు.

ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణమే సవరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ కొత్త జీవోను జారీ చేయాలని కోరారు. ఈ డబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి మద్దతుగా నిలిచారని లేఖలో స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని అంటున్న సీఎం జగన్‌కు ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాను వినియోగించుకునే హక్కును కేంద్రం రాష్ట్రాలకే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో కాపు రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హరిరామ జోగయ్య లేఖలో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed