- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాచీన కళలను కాపాడుకోవాలి: అయాచితం శ్రీధర్
దిశ, అంబర్ పేట్: ప్రాచీన కళలను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్ అన్నారు. సోమవారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి సభను గానసభ అధ్యక్షులు కళా వీఎస్ జనార్దనమూర్తి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయాచితం శ్రీధర్ పాల్గొని ఆదిభట్ల నారాయణదాసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కళ హరికథ అని అన్నారు. ఆనందాన్ని, వినోదాన్ని హరికథ అందిస్తుందని పేర్కొన్నారు. హరికథలను బ్రతికించడంతో పాటు హరికథకులను ప్రతి ఒక్కరూ ఆదరించి గౌరవించుకోవాలని తెలిపారు. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ప్రావీణ్యం ఉండి అనేక రచనలు చేసిన శతాధిక గ్రంథకర్త నారాయణ దాసు అని కీర్తించారు.
అనంతరం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పది మంది హరిదాసులకు ఒక్కొక్కరికి రూ. 4వేలు చొప్పున తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు మద్దాలి రఘురామ్, తెలంగాణ హరికథ కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి లక్ష్మీనారాయణ, జల్దా జయరాములు పాల్గొన్నారు.
- Tags
- harikatha