- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్కజ్‌కు వెళ్లిన వారిని గుర్తించాం
దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. జిల్లా నుంచి వెళ్లిన వారిలో గజ్వేల్కు చెందిన ఒకరితోపాటు మద్దూరు, చేర్యాల, అక్కన్నపేట, ములుగు మండలాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని తెలిపారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా గజ్వేల్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మొత్తం 30 బృందాలతో వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు ఐదుగురు వెళ్లి వచ్చారని, వారిని క్వారంటైన్‌లో పెట్టామన్నారు. అందులో ఒకరికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్‌కు తరలించినట్లు చెప్పారు. అతని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 18 మందితో మాట్లాడినట్లు సమాచారం వచ్చిందని, ఆ 18 మందిని హోం క్వారంటైన్‌లో పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
Tags: medak,collector,venkata ramireddy,trace,Markaz,18people