సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు..

by Ramesh Goud |
సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు..
X

దిశ, వెస్ట్ బెంగాళ్ :
సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)ను ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తీసుకునేది లేదని హోంమంత్రి అమిత్ షా మరోసారి బెంగాళ్ వేదికగా స్పష్టం చేశారు. బెంగాల్‌లో రానున్న మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌కు వెళ్లిన ‘షా’కు అడుగడుగునా సీఏఏ నిరసన కారులు అడ్డుతగిలారు.నల్ల జెండాలు, బెలూన్లతో కాంగ్రెస్ నాయకులు హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులను అరెస్టు చేశారు. బెంగాళ్ సీఎం మమతాబెనర్జీ సీఏఏను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందోని, ఆమెకు దేశం కన్నావలసదారులే ముఖ్యమని అని అమిత్ షా విమర్శించారు. సీఏఏను అడ్డుకునేందుకు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టినా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని సీఎం మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed