‘కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’

by Aamani |
‘కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’
X

దిశ, ఆదిలాబాద్: కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మేడే అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందన్నారు. కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

tag: minister allola indrakaran reddy, may day, adilabad, ts news

Advertisement

Next Story

Most Viewed