- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం అమలు చేయని కేజీ టు పీజీ తాము అందిస్తున్నాం..
దిశ, చార్మినార్ : ప్రభుత్వం అమలుపరచని కేజీ టు పీజి ఉచిత విద్యను సాలారేమిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బండ్లగూడ సెంటర్లో తాము అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. పాతబస్తీలో వేలాదిమంది విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యనందిస్తున్నామన్నారు. గురువారం ఆయన బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ సెంటర్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సుమారు 90 ప్రయివేట్ పాఠశాలలకు చెందిన 500 మంది ఉపాధ్యాయులకు రూ.15లక్షల నగదుతో పాటు రేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, నిండు దీవెనలతోనే బతికానని, ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా తమ ట్రస్ట్ ద్వారా కోట్లాదిరూపాయాలతో సేవాకార్యక్రమాలు చేపట్టామన్నారు.
గత రెండేళ్లలోనే నిరుపేదలకు రూ.12కోట్లతో నిత్యావసరసరుకులతో పాటు నగదు సహాయం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా చితికిలపడిపోయిన ప్రయివేట్ టీచర్లను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా సాయం పొందని వారుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. చాంద్రాయణగుట్టలో ముస్లింలను విద్యా వంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ఖురాన్ పఠనం తప్పకుండా చేయడం అలవరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏతేమాద్ ఉర్దూ పత్రిక ప్రతినిధి అజీజ్, నసీర్, ట్రస్టీ డైరెక్టర్ నూరుద్దీన్ ఓవైసీ, కార్పొరేటర్లు సలీం బేగ్, ఫహద్ బిన్ అబ్దాద్, అబ్దుల్ వాహెబ్, రహమాన్, అజం షరీఫ్, షబానా, హఫీజ్ పటేల్, మాజీ కార్పొరేటర్ సమద్బిఇన్ అబ్దాద్ తదితరులు పాల్గొన్నారు.