డబ్ల్యూబీబీఎల్‌కు కరోనా ఎఫెక్ట్

by Shyam |
డబ్ల్యూబీబీఎల్‌కు కరోనా ఎఫెక్ట్
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాలో ప్రారంభమైన వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. టాస్మానియా రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో అక్కడ జరగాల్సిన వీకెండ్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ఆడటానికి నిర్ణయించారు. డబ్ల్యూబీబీఎల్ మొత్తం కఠినమైన బయోబబుల్‌లో సాగుతున్నది, అయితే లీగ్‌లో ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. కానీ అకస్మాత్తుగా టాస్మానియాలో కరోనా కేసులు నమోదు కావడంతో నిర్వాహకులు ప్రేక్షకుల అనుమతిని నిరాకరించారు. దీంతో శని, ఆదివారాల్లో జరగాల్సిన నాలుగు మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. ఇకపై టాస్మానియాలో జరగాల్సిన మ్యాచ్‌లు బ్లండ్‌స్టోన్ అరేనాలో నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూబీబీఎల్‌లో ఇండియాకు చెందిన 9 మంది మహిళా క్రికెటర్లు ఆడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed