- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈనెల 20న విడుదల చేస్తాం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటల కోసం శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఈ నెల 20 నీటి విడుదల చేయనున్నట్లు గోదావరి వ్యాలీ కాలువల ఎస్ఈ వేంకటేశ్వర్ రావు, ఈఈ రామారావు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద సాగవుతున్న పంటలకు కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా నీటిని రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 35.252 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కోన్నారు. ప్రాజెక్టు ఎగువ నుంచి ప్రస్తుతం 11087 క్యూసేక్కుల నీటి వరద వస్తుందని తెలిపారు. ప్రతిరోజు ఆలీసాగర్ లీప్ట్ కు 360 క్యూసెక్కులు, గుత్ప లిప్ట్ ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈనెల 20న రెండు ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తున్నందున పరిసర ప్రాంతాల రైతులు కాలువలలో ఉన్న మోటారు పంపుసెట్లను, పైపు లైన్లను తొలిగించాలని అధికారులు సూచించారు.