- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం
దిశ ఏపీ బ్యూరో: శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రోజూ 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోందని అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 37.6570 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.500 టీఎంసీలుగా ఉంది. దీంతో జూరాల జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.