- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలుగు పారుతున్న ‘డివైడర్’.. ఎక్కడంటే..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు, వాగులు ఉప్పొంగి అలుగు పారడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఫస్ట్ టైం జాతీయ రహదారి డివైడర్ పై నుంచి అలుగు పారుతోంది. ఈ దృశ్యం నిర్మల్ పట్టణంలోని నిర్మల్ టు ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బ్రహ్మం గారి మఠం వద్ద భారీగా వరద నీరు నిలవడంతో డివైడరు పై నుంచి అలుగు పారుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అయితే, ఎగువన బంగల్ పేట చెరువు, జెనిగల కుంటలు ఉండగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇవి పూర్తిగా నిండిపోయాయి. దీంతో అలుగు, తూముల నుంచి నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు నిర్మల్ రూరల్ మండలంలోని డ్యాంగాపూర్, అనంతపేట్ చెరువులు నిండటంతో అలుగులకు గండికొట్టారు. దీంతో ఆ వరద నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది. బంగల్పేట్ చెరువు నిండి ఆ నీరంతా జాతీయ రహదారిపైకి వస్తుండటంతో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఏరియా పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం నిర్మల్ టు ఆదిలాబాద్ రహదారి ఓ వైపు పూర్తిగా నీటితో నిండిపోగా.. డివైడర్ పై నుంచి అలుగు పారే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.