వాలంటీర్ భర్తపై కత్తులతో దాడి 

by srinivas |
వాలంటీర్ భర్తపై కత్తులతో దాడి 
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ భీమిలి మండలం నిడిగట్టు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్ హేమ భర్త శ్రీనివాసరావు పై ఆగంతకులు కత్తులతో దాడి చేశారు. కాగా అతనిపై పాత కక్షలతో మాస్ చిన్నా అనే వ్యక్తి దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

హేమను మాస్ చిన్నా అనే వ్యక్తి కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో చిన్నా ను మందలించాడు ఆమె భర్త శ్రీనివాసరావు. ఈ విషయంపై రగిలిపోయిన మాస్ చిన్నా… అనుచరులతో కలిసి శ్రీనివాసరావు పై దాడికి పాల్పడ్డాడు. దాడిని అడ్డుకున్న శ్రీనివాసరావు సోదరుడు ప్రసాద్ కు కూడా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story