- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషికి మరణం లేదా.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
దిశ, ఫీచర్స్ : మానవులు ఎన్నేళ్ల వరకు జీవిస్తారు? అంటే 100 లేదా అంతకు మించి రెండు మూడేళ్లు అని సమాధానం చెబుతాం. అయితే మానవ జీవితకాల పరిమితిపై చాలాకాలంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. కానీ ఏ పరిశోధన కూడా స్పష్టంగా చెప్పలేకపోయాయి. కాగా ఇటీవల తాజా అధ్యయనాలు 150 ఏళ్ల వరకు జీవించగలమని, కొందరికి గరిష్ట సైద్ధాంతిక వయస్సు లేదని వాదిస్తున్నాయి. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో బుధవారం ప్రచురించిన కొత్త పరిశోధన ప్రకారం.. సూపర్ సెంటెనరియన్స్ (110 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) సెమీ సూపర్ సెంటెనరియన్(105 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు) గురించి కొత్త డేటాను విశ్లేషించడం ద్వారా మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది.
మరణ ప్రమాదం సాధారణంగా మన జీవితమంతా పెరుగుతుండగా, పరిశోధకుల విశ్లేషణ మాత్రం దాదాపు 50-50 వద్ద స్థిరంగా ఉంటుందని తేల్చింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మనుషులు కనీసం 130 వరకు జీవించే అవకాశం ఉంది. కానీ కనుగొన్న వాటి నుంచి ఎక్స్‌ట్రాపోలేట్ చేయడం వల్ల మానవ జీవితానికి పరిమితి లేదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ కన్‌క్లూజన్ చాలా వృద్ధుల డేటాసెట్‌లపై చేసిన సారూప్య గణాంక విశ్లేషణలకు సరిపోయింది. ఇది పరిశోధకుల బృందం అధ్యయనం చేసిన మొట్టమొదటి డేటాసెట్ అంతర్జాతీయ డేటాబేస్ ఆన్ లాంగ్వివిటీ నుంచి కొత్తగా విడుదల చేసిన మెటీరియల్. ఇది 13 దేశాల నుంచి 1,100 మందికి పైగా సూపర్ సెంటెనరియన్‌లను కవర్ చేస్తుండగా, రెండోది జనవరి 2009 – డిసెంబర్ 2015 మధ్య కనీసం 105 వయసున్న వందల మంది డేటాను కలిగి ఉంది.
‘మనిషి సిద్ధాంతపరంగా 130 ఏళ్లు లేదా అంతకు మించి జీవించవచ్చు. కానీ అది ఇప్పటివరకు సాధ్యంకాలేదు. ఈ విశ్లేషణ ఇప్పటికే 100కి పైగా అరుదైన ఘనతను సాధించిన వ్యక్తులపై ఆధారపడి ఉంది. అయితే ఈ శతాబ్దంలోపు చాలామంది 130కి చేరుకోవడాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వ్యక్తులు సూపర్ సెంటెనరియన్ హోదాకు చేరుకుంటారు. ఒక మిలియన్‌లో ఒకరు అంతకుమించి బతికే అవకాశాలు పెరుగుతాయి. కానీ వైద్య, సామాజిక పురోగతి లేనప్పుడు దీనికంటే ఎక్కువ వయస్సు ఎన్నడూ గమనించలేం. ప్రస్తుతానికి రికార్డుల పరంగా ఎక్కువ రోజులు జీవించిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ కాల్మెంట్.. 1997లో 122ఏళ్లకు మరణించారు. కానీ ఆమె నిజమైన వయస్సు అది కాదని అనేక వాదనలున్నాయి. కానీ 2019లో అనేకమంది నిపుణులు సాక్ష్యాలను సమీక్షించడం ద్వారా ఆమె వయస్సు నిర్ధారించబడింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది ధ్రువీకరించిన వ్యక్తి కేన్ తనకా. జపాన్‌కు చెందిన ఈ వ్యక్తి 118 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించింది.
– ఆంథోనీ డేవిసన్, సైంటిస్ట్, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్, స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ