- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీకటిమామిడిలో చిరుత కలకలం
దిశ, మునుగోడు: తాటి చెట్లు ఎక్కేందుకు వెళ్లిన కొంత మంది గీత కార్మికులకు పులి కనిపించడంతో భయాందోళనతో పరుగులు తీస్తూ ఇంటికి వచ్చిన ఘటన మునుగోడు మండలం చీకటిమామిడిలో శుక్రవారం జరిగింది. ఘటన అనంతరం పలువురు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లగా పులి పరిగెత్తుతూ కనిపించిందని.. దాంతో ఒక్కసారిగా భయంతో గ్రామానికి చేరకున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం పరిశోధించి చిరుతపులి ఆనవాళ్లు ఎక్కడా లేవని తెలిపింది. ప్రత్యక్ష సాక్షులను విచారించగా చారలతో ఒక జంతువు కనబడింది కానీ.. మచ్చలు లేవని వెల్లడించారని అటవీ అధికారులు తెలిపారు. దీంతో ఆ జంతువు చిరుతపులి కాదని.. హైనా అయి ఉండొచ్చని వెల్లడించారు. స్థానిక ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దన్నారు.