- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి రికార్డుకెక్కని ఇండ్లు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆస్తులన్నింటినీ నమోదు చేశారు. వలస కార్మికులు, వివరాలు సరిగా లేని 4 శాతం ఆస్తులు మాత్రమే నమోదు కాలేదు. ఇప్పటికే ధరణి భూ రికార్డుల పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ కేవలం వ్యవసాయ భూముల వివరాలకే పరిమితం చేశారు. ఇప్పుడు గ్రామాల్లో సేకరించిన సమాచారం ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది. దీనిపై ఇంత వరకు ప్రభుత్వం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
96 శాతం సర్వే..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 96 శాతం ఆస్తుల నమోదు పూర్తి చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. హడావుడిగా, ఆగమాగంగా ఆస్తుల నమోదు ప్రక్రియను ఎలాగోలా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంచాయతీ బోర్డుపై ప్రదర్శిస్తే వివాదాలు, సమస్యలు ఏర్పడుతాయనే సందిగ్ధంలో అధికారులు పడ్డారు. నిజానికి నమోదు ప్రక్రియలో చాలా తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో సేకరించిన డేటా ఆధారంగా ధరణి పోర్టల్‌లో రికార్డుకెక్కిస్తే సమస్యలు మరింత జఠిలంగా మారుతాయి. అందుకే మరోసారి పంచాయతీ కార్యదర్శి, పంచాయతీల పాలకవర్గం ఆధ్వర్యంలో తప్పుల సవరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే పంచాయతీ నోటీసు బోర్డులపై వివరాలన్నీ ప్రదర్శించాలని, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణ చేయాలని యోచిస్తున్నా, ఆస్తుల నమోదు ప్రక్రియ కొత్త వివాదాలను తీసుకువస్తుందని స్పష్టంగా వెల్లడవుతున్నది.
నిర్ణయం కోసమే వెయిటింగ్..
ఆస్తుల నమోదు ప్రక్రియను దాదాపుగా పూర్తిచేసిన పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. సర్వే పూర్తి చేసి సిద్ధంగా ఉంచామని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం తేలడం లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు రావడం లేదు.
పట్టణాల్లో కొనసాగుతున్న సర్వే..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సర్వే ముందుకు సాగడం లేదు. మొత్తం సిబ్బందిని మోహరించినా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అపార్టుమెంట్లలో వివరాలు కూడా చెప్పడం లేదు. స్థానికంగా ఇంటి యజమానులు లేకపోవడం, వారి వివరాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. అన్ని సెక్షన్ల సిబ్బందిని ఇదే పనిపై తిప్పుతున్నా వివరాలు సరిగా లేకపోవడం, వారిని గుర్తించడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.