మాస్కులు లేవు.. గుంపులుగా ఓటర్లు.. కరోనా నిబంధనలు గాలికే..

by Shyam |
మాస్కులు లేవు.. గుంపులుగా ఓటర్లు.. కరోనా నిబంధనలు గాలికే..
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లు బారులుతీరి నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు చేవెళ్ల నియోజకవర్గంలో 21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. శంకర్‌పల్లి పోలింగ్ కేంద్రంలో179 నెంబర్ పోలింగ్ కేంద్రంలో 548 మంది ఓటర్లుండగా మధ్యాహ్నం ఒక్కసారిగా.. ఓటర్లు రావడంతో ఒకే వరండాలో మహిళలు, పురుషులు నిలబడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా.. గుంపులు గుంపులుగా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో చీకటిగా వుండడం, గదిలో బెంచీలు ఉంచడం, జంబో ఓటర్ లిస్టు ఉండడంతో జాబితాలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కనిపించక ఓటు వేయడానికి కొంత ఇబ్బంది ఏర్పడిందని ఓటర్లు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా నిలబడ్డా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏ పోలింగ్ కేంద్రం ఏ గదిలో ఉందో తెలియకుండా తీవ్ర ఇబ్బంది ఎదురైందని ఓటర్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed