- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలింగ్ కేంద్రాల వద్ద అమలు కానీ కొవిడ్ నిబంధనలు
by Shyam |
X
దిశ, సిద్దిపేట: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు ఏ మాత్రం అమలు జరగడం లేదు. ఓటర్లు భౌతిక దూరం ఏ మాత్రం పాటించడం లేదు. పోలింగ్ కేంద్రాల బయట గుంపులు, గుంపులుగా పార్టీ కార్యకర్తలు, జనం పోగవుతున్నా అధికారులు, పోలీసుల కంటికి ఆ దృశ్యాలు కనిపించడం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై శివాలెత్తే పోలీసులకు 144 సెక్షన్ యథేచ్ఛగా దుర్వినియోగం అవుతున్నా కళ్ళప్పగించి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే భౌతిక దూరం జాడ కనిపించడం లేదు. పదుల సంఖ్యలో ఓటర్లను ఆటోల్లో తీసుకొస్తున్న అభ్యర్థులు నేరుగా పోలింగ్ కేంద్రం ఎదుటనే దింపుతున్న దుస్థితి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
Advertisement
Next Story