- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్లో మందకొడిగా సాగుతున్న పోలింగ్
దిశ, వెబ్డెస్క్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించడం లేదు. పోలింగ్ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో నామమాత్రంగా పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 4.2 శాతం పోలింగ్ నమోదైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ 46 శాతం పోలింగ్ దాటలేదు. అయితే ఓటు వేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉండటంతో గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జంట సర్కిళ్ల పరిధిలోని 7 డివిజన్లలోనూ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభం అవ్వగా.. ఇప్పటివరకు చాలా తక్కువ శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
డివిజన్ల వారిగా పరిశీలిస్తే..
మాదాపూర్ డివిజన్ లో 3శాతం
కొండాపూర్ డివిజన్ లో 3శాతం
గచ్చిబౌలి డివిజన్ లో 3శాతం
హఫీజ్ పేట్ డివిజన్ లో 4శాతం
చందానగర్, శేరిలింగంపల్లి, మియాపూర్ డివిజన్లలో 5శాతం
ఐటీ సెక్టార్ ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వరస సెలవులు, కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతం స్వల్పంగా నమోదు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మాస్ ఓటర్లు కూడా ఈసారి ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడమే ఆందోళన కలిగించే అంశం.