- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరిగిలో లాక్‌డౌన్.. ‘19 గంటలు’ అన్ని బంద్
దిశ, పరిగి : రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో శనివారం నుంచి స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచనల మేరకు పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, పరిగి ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్, కమిషనర్, కౌన్సిలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందున స్వచ్చందంగా లాక్డౌన్విధిస్తున్నట్టు తెలిపారు.
శనివారం(8వ తేదీ) నుంచి 16వ తేదీ ఆదివారం వరకు లాక్‌డౌన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణ సముదాయాలు తెరిచి కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే రోజులో 19 గంటలు విధిగా లాక్‌డౌన్ పాటించాలని సూచించారు. పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిత్యావసర సరుకులు ఆ 5 గంటల వ్యవిధిలోపే తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షాపింగ్ చేయాలని తెలియజేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప, ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు.