- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్ట్..
ముంబై : రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆదిత్యను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆదిత్య బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చాడని, చెన్నై నుంచి పలు ప్రాంతాలకు ఆదిత్య వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. గత అక్టోబర్‌లోనే ఆదిత్య ఆళ్వా కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు ముంబైలోని వివేక్ ఒబెరాయ్ నివాసంలో గురువారం సోదాలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్‌తో ముంబైకి వెళ్లారు. ఆ సందర్భంలో.. ఆదిత్య ఆళ్వా అక్కడ లేకపోవడం గమనార్హం.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారందరితోనూ ఆదిత్య ఆళ్వాకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఆళ్వాకు చెందిన ‘హౌస్ ఆఫ్ లైఫ్’ రిసార్ట్‌లో పలు పార్టీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదిత్య ఆళ్వాపై అప్పట్లోనే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆదిత్య దేశంలోనే ఉన్నట్లుగా భావించిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు సాగించారు. ఎట్టకేలకు చెన్నైలో ఆదిత్య ఆళ్వాను అదుపులోకి తీసుకున్నారు.