- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అచ్చంపేట గ్రామాన్ని సందర్శించిన : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి
దిశ,నర్సాపూర్: నర్సాపూర్ మండల పరిధిలోని అచ్చంపేట గ్రామాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితారెడ్డి శనివారం నాడు సందర్శించారు. గ్రామంలోని పెద్ద చెరువు కట్టతెగిపోయి వరద నీరు ఇళ్లలోకి వచ్చి నష్టపోయిన భాదితులను పరామర్శించారు, అనంతరం పంట నష్టపోయిన బాధితులతో పాటు , ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, కోల్పోయినా బాధితులతో మాట్లాడారు, బాధితకుటుంబాలకు ప్రభుత్వం నుండి అందవలసిన నష్టపరిహారం వెంటనే విడుదల చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. అత్యవసర సహాయం కింద బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. చెరువు కట్ట పునః నిర్మాణం కోసం ప్రతిపాదనలను తయారు చేయాలని ఇరిగేషన్ ఏఈ మణిభూషన్‌ను ఆదేశించారు. అలాగే వరద వల్ల పంట నష్టపోయిన బాధితుల జాబితా తయారు చేయాలని తహసీల్దార్ రాణిని కోరారు. కార్యక్రమంలో ఆర్ ఐ, ప్రవీణ్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు.. అశోక్ గౌడ్, శేఖర్, నహీమ్, సురారం నర్సింలు, సత్యం గౌడ్, వెంకటేష్, రాజేష్ ,తదితరులు ఉన్నారు.