భారత షట్లర్ బృందానికి వీసా కష్టాలు

by Shyam |
భారత షట్లర్ బృందానికి వీసా కష్టాలు
X

దిశ, స్పోర్ట్స్: స్పెయిన్‌లోని వెల్వా వేదికగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ 2021 జరుగుతున్న విషయం తెలిసిందే. కీలకమైన ఈ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెళ్లలేదు. కరోనా కారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లనని ఆయన ముందే చెప్పడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అతడికి వీసాను మంజూరు చేయించలేదు. అయితే తాజాగా ఇతర కోచ్‌లకు కూడా వీసాలు మంజూరు కానట్లు తెలుస్తున్నాయి. బాయ్ కోచ్ మహ్మద్ సియాదత్ ఉల్లా తనకు వీసా మంజూరు కాని విషయం తెలిపాడు. స్పానిష్ ఎంబసీకి అవసరమైన డాక్యుమెంట్లు అందక పోవడంతోనే వీసా మంజూరులో సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తున్నది. ఇక డబుల్స్ కోచ్ అరుణ్ విష్ణు స్పెయిన్ సమయానికే చేరుకున్నాడు. కానీ కిదాంబి శ్రీకాంత్ వెళ్లడంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరకు బాయ్ అధికారులు అతడికి లైన్ క్లియర్ చేశారు. ఇక పీవీ సింధు నేరుగా బాలి నుంచి స్పెయిన్ వెళ్లిపోయింది. భారత షెట్లర్ల బృందానికి వీసాల విషయంలో ఏర్పడిన అవరోధాలపై విచారణ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed