- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శాంపిల్స్ సేకరణ కేంద్రం
దిశ, నిజామాబాద్: కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించడానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని సిద్ధం చేయించినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రిలో నమూనాలను సేకరించనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల ఆధునిక పద్ధతిలో కరోనా అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శాంపిల్స్ సేకరించే వైద్య సిబ్బందికి ఈ కేంద్రం మరింత రక్షణగా ఉంటుందన్నారు. పేషెంట్లు ఒకరినొకరు కలిసే అవకాశం లేకుండా వేర్వేరుగా శాంపిల్స్ తీసుకోవడానికి, సిబ్బంది నేరుగా రోగులను తాకకుండా ఈ కేంద్రానికి బయట నుంచి గ్లౌజులు అమర్చామన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారని నారాయణరెడ్డి వివరించారు.
tags: virus testing center, district general hospital, blood sample, lockdown, collector narayana reddy