- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భంలోనే శిశువుకు సోకిన కరోనా
పూణె: దేశంలోనే తొలిసారిగా గర్భస్థ శిశువుకు తల్లి నుంచి కరోనా సోకిన ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్ర పూణెలోని ససూన్ జనరల్ హాస్పిటల్‌లో కరోనా సోకిన తల్లి నుంచి ప్లేసెంటా ద్వారా గర్భంలోని శిశువుకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. పీడియాట్రిక్స్ శాఖ హెడ్ డాక్టర్ ఆర్తి కినికర్ అందించిన వివరాల ప్రకారం, గర్భిణులందరికీ కరోనా టెస్టు నిర్వహించాలన్న ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు అందరికీ పరీక్షలు చేశారు. హాస్పిటల్‌లో చేరిన ఓ గర్భిణీకి కరోనా లక్షణాలున్నా టెస్టు చేస్తే నెగెటివ్ వచ్చింది.
ఆమె ప్రసవించిన ఆడ శిశువు చెవి నుంచి స్వాబ్, బొడ్డు ప్రేవు, ప్లేసెంటా(గర్భందాల్చగానే యుటీరియస్‌లోనే వృద్ధి చెంది తల్లి నుంచి ఆక్సిజన్, పోషకాలు అందించడానికి సహాయపడే ఆర్గన్)లను పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చింది. బిడ్డలో కరోనా తీవ్ర లక్షణాలు కనిపించాయి. దీంతో రెండువారాలు ప్రత్యేక వార్డులో ఉంచి బేబీకి నయం చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ సురక్షితంగా ఉన్నారు. గర్భంలోనే శిశువకు వర్టికల్ ట్రాన్‌స్మిషన్ ద్వారా సోకిందని డాక్టర్ ఆర్తి వివరించారు. కాగా, తల్లీ బిడ్డల బ్లడ్ టెస్టు చేయగా ఇరువురిలోనూ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు గుర్తించామని తెలిపారు.