- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్‌లో 'కింగ్' కోహ్లి
దిశ, స్పోర్ట్స్: ఇన్‌స్టాగ్రమ్(Instagram)లో టీమ్ ఇండియా(Team India) కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) రికార్డు సృష్టించాడు. అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలెబ్రిటీల్లో తొలి ఏసియన్, తొలి ఇండియన్, తొలి క్రికెటర్(Cricketer)గా రికార్డు సృష్టించాడు. 75 మిలియన్ (7.5 కోట్లు) ఫాలోవర్స్(Followers) కలిగిన 4వ అథ్లెట్‌గా నిలిచాడు. క్రీడాకారుల్లో కోహ్లి కంటే ముందు రొనాల్డో(Ronaldo), మెస్సీ(Messi), నెమార్ జూనియర్‌లు మాత్రమే ఉన్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న 40మంది జాబితాను సంస్థ విడుదల చేయగా అందులో కోహ్లికి చోటు దక్కింది. సెలెబ్రిటీలు(Celebrities) ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించి తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలు కలిగి ఉన్నాయి. వీరందరిలో అత్యధిక ఫ్యాన్స్ కలిగి ఉన్న ఏకైక క్రికెటర్ కొహ్లీ మాత్రమే. ఇక ఇన్‌స్టాలో 238 మిలియన్ ఫాలోవర్స్‌తో పోర్చుగల్(Portugal) సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా, మ్యుజీషియన్(Musician), నటి అరియానా గ్రాండే 199 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో, హాలీవుడ్(Hollywood) నటుడు డ్వేన్ జాన్సన్(Dwayne Johnson) (ది రాక్) 194 మిలియన్ ఫాలోవర్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director) కార్డీ బీని దాటి కొహ్లీ 75.5 మిలియన్ ఫాలోవర్స్‌తో 29వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆసియా(Asia), ఇండియా(India)ల్లో కోహ్లిదే అగ్రస్థానం.