ఏపీ వ్యక్తికి కరోనా.. యూపీలో 14 గ్రామాలు మూసివేత

by srinivas |
ఏపీ వ్యక్తికి కరోనా.. యూపీలో 14 గ్రామాలు మూసివేత
X

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకితే ఉత్తరప్రదేశ్‌లోని 14 గ్రామాలెందుకు మూసేశారన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి… ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని భవానీపూర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

అతను గత నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌లో పాల్గొని వచ్చాడు. దీంతో ఆయనకు కరోనా సోకింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలను రెడ్ జోన్‌ విధించినట్టు తెలిపారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ 14 గ్రామల్లో క్వారంటైన్ అమలవుతోంది.

దీంతో ఆ గ్రామాల రహదారులన్నీ మూసేశారు. ఆ గ్రామాల శివార్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో చాటింపు వేయించడం ద్వారా అవగాహన కల్పించారు. మరోవైపు ఆగ్రాలో 30 కేసులు నమోదు కాగా, ఆ జిల్లాలో కరోనా 134 మందికి సోకిందని తేలింది. దీంతో యూపీలో కరోనా బాధితుల సంఖ్య 483కు చేరుకుంది.

tags: coronavirus, ap, up, covid-19. budaun district, bhawanipur kali

Advertisement

Next Story

Most Viewed