- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇర్ఫాన్ కు గుర్తుగా.. ఊరి పేరు మార్చిన గ్రామస్తు లు
దిశ, వెబ్ డెస్క్ :
కొందరు మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాము చేసిన మంచి పనులు, సేవలు వాళ్లని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి. ఇటీవలే కేన్సర్ తో మరణించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు అలాంటి అరుదైన గౌరవమే దక్కింది. మహారాష్ట్రలోని ఇగత్ పురి గ్రామంతో ఇర్ఫాన్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ ఊరికి, అక్కడి ప్రజలకు ఇర్ఫాన్ సేవలందించారు. ప్రేమను పంచారు. ఇర్ఫాన్ గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా ఊరికి అతని పేరు పెట్టాలని ఆ గ్రామస్తులు నిశ్చయించుకున్నారు.
తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్. అతను చనిపోయి రెండు వారాలు కావస్తున్న ఇంకా అభిమానులు ఇర్ఫాన్ ను తలుచుకుంటున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఇర్ఫాన్ తో తమకు ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. మహారాష్ర్టలోని ఇగత్ పురి గ్రామస్థులైతే ఊరికి అతని పేరు పెట్టి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే అతడి జ్ఞాపకార్థం ఇగత్‌పురిని మార్చి హీరో-చి-వాడి (నైబర్ హుడ్ హీరో) అని పేరు పెట్టారు. ఈ గ్రామంలో ఇర్ఫాన్ ఖాన్ గతంలో భూమి కొన్నాడు. ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఆ ఊరి పరిస్థితిని చూసి ఇర్ఫాన్ చలించిపోయారు. ఆ తర్వాత ఊరికి అత్యవసర సర్వీసుల నిమిత్తం ఓ అంబులెన్స్, పిల్లల చదువుల కోసం ఓ పాఠశాల నిర్మించారు. గ్రామంలో ఏ అవసరం వచ్చినా ఇర్ఫాన్ ముందుండేవారు. గ్రామంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపించారు. విద్యార్థుల కోసం కంప్యూటర్లు, పుస్తకాలు, రెయిన్ కోట్స్, స్వెటర్లు అందించారు. పండుగ సమయంలో ప్రజలతో కలిసి గడపడంతో పాటు, గ్రామస్థులకు స్వీట్లు పంచడం చేస్తుండే వారు. ఇలా ఇగత్ పురి గ్రామానికి ఏ అవసరమున్నా పదేళ్లుగా తన వంతు సహాకారం అందిస్తూ.. గ్రామస్థుల హృదయాల్లో రియల్ హీరోలా నిలిచిపోయారు. తమ గ్రామానికి సంరక్షకుడిగా, అండగా నిలబడిన ఇర్ఫాన్ ఖాన్ సేవలకు గానూ ఇగత్ పురి వాసులు ఊరి పేరు మార్చి నివాళులు అర్పించుకున్నారు.