- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పంచాయతీ సెక్రెటరీ మాకొద్దు.. మీడియా ముందుకు వచ్చిన గ్రామస్తులు
దిశ, మరిపెడ: అభివృద్ధికి ఆటంకంగా మారిన పంచాయతీ సెక్రెటరీ మాకొద్దు అంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామస్తులు మంగళవారం సాయంత్రం ఎంపీడీవోను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామ పంచాయతీ సెక్రెటరీగా మయూరి గత 16 సంవత్సరాలుగా ఒకే గ్రామంలో విధులు నిర్వహిస్తూ.. అజమాయిషీకి పాల్పడుతూ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారు.
అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు జరిగాయో అధికారులు పరిశీలించాలన్నారు. గ్రామంలో ఉంటూ విధులు నిర్వహించాల్సిన కార్యదర్శి దూర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ తన భర్తను వెంట తీసుకోరావటంతో ఆయన పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో జరిగే వర్క్స్ గ్రామస్తులకు ఇవ్వకుండా తన భర్తతో పెట్టుబడి పెట్టించి చేయిస్తున్నారని వివరించారు. ఉపాధి హామీ పథకంలోని మహిళల పట్ల ఆమె భర్త దురుసుగ వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.