- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెను చూడకుండా వెళ్లిపోయా.. చనిపోయాక రియలైజ్ అయ్యా! : నటుడు
దిశ, సినిమా : హిందీ టెలివిజన్ యాక్టర్, ప్రొడ్యూసర్ వికాస్ గుప్తా తన చుట్టూ ఉన్న కాంట్రవర్సీల గురించి ఓపెన్ అయ్యారు. ఇందులో ఒకటైన ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీతో డేటింగ్‌పై పలు విషయాలు మాట్లాడారు. ప్రత్యూషతో బ్రేకప్ అయ్యాకే తాను బైసెక్సువల్ అని ఆమెకు తెలిసిందని వివరించాడు. తాను డేటింగ్ చేసిన వారిలో ఇద్దరు లేడీస్ మాత్రమే తన సెక్సువాలిటీ గురించి తెలుసుకున్నారని చెప్పాడు. అందులో ఒకరు చనిపోయిన ప్రత్యూష కాగా, మరొకరి పేరు చెప్పేందుకు నిరాకరించాడు. ప్రత్యూష, తాను షార్ట్ పీరియడ్ మాత్రమే కలిసున్నా, సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కానీ కొందరు తన గురించి ఆమెకు చెడుగా చెప్పడం వల్ల గొడవలు జరిగి విడిపోయామన్నాడు. ఆ తర్వాత తనపై కోపం పెరిగిందని, ఎదురుగా కనిపించినా పట్టించుకోకుండా వెళ్లిపోయానని చెప్పాడు. దీంతో అలా ఎందుకు చేస్తున్నావని ప్రత్యూష ప్రశ్నించిందన్న వికాస్.. తనంటే చాలా ఇష్టమని చెప్పాడు. తనతో బిగ్ ప్రాజెక్ట్ కూడా చేయాలనుకున్నట్లు వివరించాడు.
ప్రత్యూష 2016లో తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకోగా.. ఈ కేసులో తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ నిందితుడు. కాగా రాహుల్‌కు ముందు మక్రంద్ మల్హోత్రాతో డేటింగ్ చేసిన ప్రత్యూష.. ఆ సమయంలో చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఏప్రిల్ 1న తను చనిపోయిందనే కాల్ వస్తే, ఫ్రాంక్ కాల్ అనుకున్నట్లు చెప్పాడు. తనను ఫూల్ చేసేందుకు మాత్రమే ఇలా చెప్తున్నారని అనుకున్నాను గానీ ఆ స్టార్ త్వరగా ఈ యూనివర్స్‌ను విడిచి వెళ్లిపోయిందన్నాడు వికాస్ గుప్తా.