- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మన దేశంలో చాలా కంట్రోల్‌లో ఉంది. కారణం డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. మనల్ని ఇంట్లో జాగ్రత్తగా ఉంచి… మనకు రక్షణ కవచాల్లా మారిపోయారు. కరోనా గాలి కూడా మనకు సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం మనకోసం పోలీసులు నిద్రాహారాలు మాని… రేయింబవళ్లు ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. ఫ్యామిలీలకు దూరంగా రోడ్లమీద బతుకున్నారు. మరి అలాంటి వాళ్లకు థాంక్స్ చెప్పుకోవాలి కదా.
We might be heroes on-screen but in reality, the @TelanganaCOPs are the true heroes : Hero @TheDeverakonda appreciates the efforts of #Telangana Police.@TelanganaDGP @hydcitypolice #Lockdown #VijayDeverakonda#FrontLinePoliceOfficers pic.twitter.com/NeZ3YyVwBS
— BARaju (@baraju_SuperHit) April 11, 2020
అందుకే ఆ రియల్ హీరోస్‌కు థాంక్స్ చెప్పేందుకు తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాడు రీల్ హీరో విజయ్ దేవరకొండ. తెలుగు ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు తెలిపాడు. మా ఇండస్ట్రీ మొత్తం మీ వెనకాల ఉందని భరోసా ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు నిత్యావసరాలు పేదలకు చేర్చడం, కరోనా చైన్ బ్రేక్ చేయడంలో పోలీసుల పాత్ర అమోఘమని ప్రశంసించాడు. మేము స్క్రీన్ మీద హీరోలు కావచ్చు.. కానీ నిజంగా మీరు మా హీరోలు అంటూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. 20 రోజులు లాక్ డౌన్ గడిచింది… ఇంకా పొడిగించొచ్చేమో నాకు తెలియదు.. కానీ మీరు మాత్రం అలసిపోవద్దని కోరాడు. మీరు బలంగా, శక్తివంతంగా ఉంటూ మన తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరాడు.
Tags: Vijay Devarakonda, Hero, Real Heroes, Covid 19, CoronaVirus