- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బిచ్చగాడు 2’ అనౌన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన మురుగదాస్
దిశ, సినిమా : కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా సుపరిచితుడైన విజయ్ ఆంటోనీ.. ‘బిచ్చగాడు’ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన విజయ్ ఆంటోనీ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇదే క్రమంలో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గానూ పనిచేసిన విజయ్.. ప్రస్తుతం డైరెక్టర్‌గా మారిపోయాడు. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కిస్తున్నాడు.
ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా మల్టిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సీక్వెల్‌ను కూడా ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన ‘విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ నిర్మిస్తుండగా.. ప్రముఖ రచయిత భాష్యశ్రీ మాటలు అందిస్తున్నారు. ఇక ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు చెప్తూ.. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను రివీల్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు మురుగదాస్ మూవీ పోస్టర్ విడుదల చేశారు.