జైలుకు పోయినా పర్లే.. టీ మాత్రం వదలనంటున్న ముదుర్లు.!

by Shyam |
జైలుకు పోయినా పర్లే.. టీ మాత్రం వదలనంటున్న ముదుర్లు.!
X

దిశ, ఫీచర్స్ : టీ లవర్స్ మోటో.. ‘నేను.. నా టీ.. నా సిప్.. ఈ క్షణం ప్రపంచం ఎక్కడ పోతే నాకేంటి’ అన్నట్లు ఉంటుంది. టీ కనపడితే చాలు ప్రాణం లేచి వస్తుంది. ఒక్క చాయ్ తాగితే చాలు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఇట్టే సెట్ అయిపోతాయి. కానీ జైలుకు వెళ్లే మోమెంట్‌లో కూడా టీ లవర్స్ ఇలాగే బిహేవ్ చేస్తారా? లేక పోలీసులంటే భయంతో ఇప్పుడు ‘టీ’ ఏందిర బై.. లైఫ్ క్రైమ్ రికార్డ్స్ ఎక్కుతుంటే అనుకుంటారా? అంటే.. తర్వాత సంగతి తర్వాత ముందైతే ఒక టీ లాగించేద్దాం అన్నట్లుగానే ఉంటారని ఈ వీడియోతో ప్రూఫ్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ క్లిపింగ్‌లో.. ఖాకీలు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీస్ వ్యాన్ ఎక్కించేందుకు లాక్కెళ్తున్నారు. వారు ఏం క్రైం చేశారో పక్కన పెడితే.. తమను పట్టుకుంది పోలీసులు.. తీసుకెళ్తుంది జైలుకు.. అనే భయం లేకుండా చేతుల్లో ఉన్న చాయ్‌ని వెంటనే తాగేస్తే బాగుండు అనే ఫీల్ అవుతున్నారు. పోలీసులు ఓ పక్క లాక్కెళ్తుంటే ఇద్దరు నిందితుల్లో ఓ వ్యక్తి టీ తాగాలా లేదా? అని ఆలోచిస్తూనే ఒక సిప్ తీసుకుంటే.. మరో వ్యక్తి మాత్రం తాపీగా చాయ్ తాగుతూనే వ్యాన్ ఎక్కేశాడు. కాగా ‘ట్యూబ్. ఇండియన్’ అనే మీమ్ పేజ్ ఈ వీడియోను షేర్ చేయగా.. ‘అసలైన చాయ్ ప్రేమికులు వీరే!’ అంటూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు టీ లవర్స్. దీంతో ఇప్పటి వరకు 1.7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న వీడియోకు లైక్స్ పడుతూనే ఉన్నాయి.

https://www.instagram.com/p/CPXWGtWg8Td/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed