వైరలవుతున్న తమన్నా వీడియో

by Shyam |   ( Updated:2023-06-13 17:51:14.0  )
Thamanna-Video
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ‘హ్యాపీ డేస్’తో ఇంట్రడ్యూస్ అయ్యి దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది తమన్నా.. కెరీర్ ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉందో 30 ప్లస్‌లో అదే గ్రేస్‌ మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ, కొవిడ్ సమయంలో లావయ్యిందంటూ నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొన్న బ్యూటీ.. ఇప్పుడు లావు తగ్గేందుకు జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు మళ్లీ ఫర్ఫెక్ట్‌ బాడీని తొందర్లోనే సంపాదించి తనని ట్రోల్ చేసిన నెటిజన్లతోనే వావ్‌ అనిపించుకునేందుకు కఠినమైన వ్యాయామ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే తన వర్కౌట్‌ను వీడియో తీసి అభిమానులతో పంచుకున్న తమన్నా.. ఇది చూసి మీరు కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా తయారు కావాలని మెసేజ్ ఇచ్చింది. ఇక మిల్కీ బేబీ కష్టాన్ని చూసిన ట్రోలర్స్‌ ఏదో సరదాగా అంటే మరీ ఇంత కష్టపడాలా? నీ కష్టాన్ని చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తప్పు జరిగిపోయింది.. ‘మా’ ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story