శంషాబాద్ లో దారుణం…40 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ దారుణ హత్య

by Kalyani |
శంషాబాద్ లో దారుణం…40 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ దారుణ హత్య
X

దిశ, శంషాబాద్ : గత నలభై రోజుల క్రితం అదృశ్యమైన ఓ మహిళ చివరకు దారుణ హత్యకు గురైన ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజపూర్ తండా కు చెందిన మూడవత్ డోలి (38) గత 40 రోజుల క్రితం అదృశ్యమైంది. తన భార్య మూడవత్ డోలి కనిపించడం లేదని భర్త ఆనంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గురువారం మృతురాలి కొడుకుని విచారించగా మా అమ్మ ముడావత్ డోలి గత 30 రోజుల క్రితమే మా నాయనమ్మ తులసి దగ్గరికి సాతంరాయ్ గ్రామానికి వచ్చిందని, వచ్చిన రోజే కల్లు కాంపౌండ్ లో ఇద్దరూ కల్లు తాగి పరస్పరం గొడవకు దిగారని తెలిపారు. అనంతరం అత్త తులసి తన కోడలు మూడవత్ డోలిని (38) కొట్టి చంపినట్లు తెలిసిందన్నారు. మృతురాలి అత్త తులసిని అదుపులోకి తీసుకొని మృతదేహం ఎక్కడ పెట్టారని విచారించగా సాతంరాయ్ గ్రామం వద్ద తాను పనిచేస్తున్న పొలంలో పాతిపెట్టినట్లు తెలిపింది. దీనిలో భాగంగానే మృతదేహం కోసం జెసిబి తో తవ్వకాలు జరపగా తవ్వకాల్లో మృతురాలు ముడావత్ డోలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైనదన్నారు.

Advertisement

Next Story