Breaking News : ఫ్యాక్టరీలో కుప్పకూలిన చిమ్నీ... 8 మంది మృతి

by M.Rajitha |   ( Updated:2025-01-09 13:39:22.0  )
Breaking News : ఫ్యాక్టరీలో కుప్పకూలిన చిమ్నీ... 8 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chatthisghad) లోని ఓ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్(Steel Plant) లోని చిమ్నీ కుప్పకూలిన(Chimney Collapsed) ఘోర దుర్ఘటన గురువారం చోటు చేసుకుంది. ముంగెలీ జిల్లాలోని స్టీల్ ప్లాంట్ పరిశ్రమలో చిమ్నీ నిర్మాణం చేపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా చిమ్నీ కూలి పోవడంతో.. అక్కడ పనిచేస్తున్న 25 మంది కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారని అధికారులు తెలియ జేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story